చిరుత పులిని బంధించి తీసుకెళ్లండి

77చూసినవారు
కోసిగిలోని తిమ్మప్ప కొండలో ఉన్న చిరుత పులిని బంధించి తీసుకెళ్లాలని గొర్రెలకాపరి దస్తగిరి డిమాండ్ చేశారు. సోమవారం కొండ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మేత మేస్తున్న మేకల మందపై చిరుత దాడి చేసి రెండు మేకలను పొట్టన పెట్టుకుందని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్