భక్తిశ్రద్దలతో మిలాద్ ఉద్ నబి వేడుకలు

60చూసినవారు
మిలాద్ ఉద్ నబి వేడుకలు పెద్దకడబూరు గ్రామంలో ముస్లింల మత గురువు అబ్ధుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు. కొత్త మసీదు నుంచి మక్కా మసీదు నమూనాతో ముస్లింలు గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలతో నినాదాలు చేశారు. స్తానిక బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి సందేశం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్