క్రిస్మస్ పండుగ సందర్భంగా పెద్దకడబురులోని సీఎస్ఐ చర్చి నందు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండల నాయకులు రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఎస్సై నిరంజన్ రెడ్డితో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. పాస్టర్ మనోహర్ బాబు వారికి ప్రార్థన చేశారు. ఆ ఏసు ప్రభువు దీవెనలతో రాష్ట్రంలోని రైతులు, ప్రతి ఒక్కరూ బాగుండాలని తిక్కరెడ్డి ఆకాంక్షించారు.