వైఎస్ఆర్ విగ్రహాన్ని ద్వంసం చేయడం పిరికిపంద చర్య

50చూసినవారు
వైఎస్ఆర్ విగ్రహాన్ని ద్వంసం చేయడం పిరికిపంద చర్య
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ద్వంసం చేయడం పిరికిపంద చర్య అని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి అన్నారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డి గ్రామ శివారుల్లో గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కుట్రతో వైఎస్ఆర్ విగ్రహాన్ని ద్వంసం చేశారని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్