ఎమ్మిగనూరులో నిన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథ మహోత్సవం సందర్భంగా ఎంపీపీ కేశన్నను పోలీసులు కొట్టారని నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ బుట్టా రేణుక గురువారం ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహంతో ఆయనను అవమానించారని అన్నారు. ఈ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని పోలీసులు అవమానించడం తగదని హెచ్చరించారు.