ఘనంగా మిలాద్ ఉద్ నబి

81చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో సోమవారం మిలాద్ ఉద్ నబి వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ముస్లిం సోదరులు మక్కా మసీదు నమూనాతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలతో నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని ఆకాంక్షించారు. ఇందులో ముస్లిం పెద్దలు ఉసేన్ తాతా, బడేసాబ్, అజీజ్ తాతా తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్