పెద్దకడబూరు మండల ఈఓఆర్డీగా జయరాముడు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డోన్ మండల పరిషత్ కార్యాలయంలో ఈఓఆర్డీగా పనిచేస్తున్న జయరాముడు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా మండల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేస్తానన్నారు.