కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది

72చూసినవారు
కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది
కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ. శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించేవారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

సంబంధిత పోస్ట్