పెద్దకడబూరు మండల పరిధిలో కల్లుకుంట, కమ్మలదిన్నె తదితర గ్రామాల్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా చర్చిలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దకడబురులోని సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిలో పాస్టర్లు మనోహర్ బాబు, సంజీవ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రీస్తు తెలిపిన శాంతి, ప్రేమ అన్న దయగుణాలను సాటి మనిషి పట్ల కలిగి ఉండాలని క్రైస్తవ సోదరులకు వివరించారు.