ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి పెద్దకడబూరు మండల టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి, విజయ్ కుమార్, సిద్ధప్ప, సుదర్శనం, కాకి ఇస్సాక్ సోమవారం కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పెద్దకడబూరు మండలానికి మాజీ మంత్రి కీ శే బీవీ మోహన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు.