భారత్ మిరపకాయ.. స్పైసీ చిప్స్ తిని ఆస్పత్రిపాలైన జపాన్ విద్యార్థులు

68చూసినవారు
భారత్ మిరపకాయ.. స్పైసీ చిప్స్ తిని ఆస్పత్రిపాలైన జపాన్ విద్యార్థులు
జపాన్ లో ఓ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఈశాన్య భారతదేశంలో పండించే భుట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేసిన సూపర్-స్పైసీ బంగాళాదుంప చిప్స్ తిని ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 13 మంది బాలికలు, ఒక అబ్బాయి ఉన్నట్లు సమాచారం. ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీగా గిన్నిస్ రికార్డ్ ఉంది. ఈ చిప్స్ ని 18 ఏళ్లలోపు వారు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్