ఆయుర్వేదంలో దీర్ఘకాలిక రోగాలకు ఉపశమనమునకు మందులు ఉన్నాయని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ డి. సావిత్రి పాములపాడు గ్రామంలో శుక్రవారం అన్నారు. ఈసందర్భంగా డాక్టర్ డి. సావిత్రి మాట్లాడుతూ ఈ ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైన వైద్యం అని, ఇందులో అనుభవం ఉన్న వైద్యులు ఉండి మరియు నాణ్యత కలిగిన మందుల లభ్యమైతే, శస్త్ర చికిత్స అవసరంలేని రోగములన్నింటికి కూడా నయం చేయవచ్చునన్నారు.