ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని సిపిఎం పగిడ్యాల మండల కన్వీనర్ పక్కిర్ సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పగిడ్యాల మండల కేంద్రంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో 14న తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ప్రజా సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.