ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీధారులు ధరఖాస్తు చేసుకున్న ప్రతి అర్జీని పరిష్కరించాలని తహసీల్దార్ ఉమారాణి సూచించారు. సోమవారం కొత్తపల్లి స్థానిక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో ఆధార్‌కార్డులో పుట్టిన తేదీలు తప్పుగా ఉండడంతో బర్త్ సర్టిఫికెట్లు కావాలంటూ 21 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు.