నంద్యాలకు చెందిన కిశోర్, జ్యోతి దంపతుల కూతురు విన్మయి లక్ష్మీ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. మరోపక్క ఎన్నో అద్భుత చిత్రాలు గీస్తూ అందరినీ అబ్బుర పరుస్తుంది. భవిష్యత్ లో చిత్రలేఖనంలో రాణిస్తానని అంటుంది. తాజాగా శనివారం సగభాగం గజా, ఆంజనేయుడు ముఖ చిత్రాన్ని గీసింది. 5వ తరగతిలోనే విద్యార్థినికి చిత్రాల పై ఇంత పట్టు ఉండడం ఎక్కడా చూడలేదని ఉపాధ్యాయులు అన్నారు.