గోస్పాడు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరము ముగింపు వేడుకలు

1926చూసినవారు
గోస్పాడు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరము ముగింపు వేడుకలు
గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో ఈరోజు అనగా 11-06-2023 న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమం లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తక పఠనము గావించి తదుపరి ముగింపు వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం. ఈ. ఓ అబ్దుల్ కరీం విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుకరించారు. ముఖ్యముగా మీరు ప్రతి దినం చదవడం మర్చిపోవద్దని చదవడం వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుందని హితము పలికారు. ప్రతి దినం గ్రంధాలయాన్ని దర్శించి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని గ్రంథాలయ అధికారి హితము పలికారు. తదుపరి వీరికి స్వీట్స్, చల్లని నీటిని, కాఫీని , గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్