దసరా వేషాలకు వంద సంవత్సరాల చరిత్ర ఉందని గంగిశెట్టి దీపక్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 11వ తేదీ నంద్యాల ఇండోర్ స్టేడియం నందు దసరా వేషాల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి బహుమతిగా 50,000₹, రెండవ బహుమతిగా 30,000₹, మూడో బహుమతిగా 20,000₹ అందిస్తున్నామని తెలిపారు. పోటీలో పాల్గొన్న ప్రతి టీంకు 10,000₹ ప్రోత్సాహక నగదును అందిస్తున్నామన్నారు.