ఎస్సీ, ఎస్టీ కాలనీలో నూతనంగా ఎంపికైన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సందర్శించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, అణగారిన వర్గాల ప్రజలపై దాడులు, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం, పరిహార చెల్లింపు తదితర సమస్యలను గుర్తించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లాఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు.