నంద్యాల నుంచి గడివేములకు వెళ్ళే రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగించడంతో పోలూరు గ్రామ ప్రజలు దుమ్ము కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో, రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.