ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.