నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ సెంటర్ నందు రాయలసీమ యూనివర్సిటీ అనుబంధంతో ఒక సంవత్సరం పార్ట్ టైం యోగా పీజీ డిప్లమా కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు గురువారం యోగ చైతన్య కేంద్రం సెక్రెటరీ దామోదర్ రెడ్డి తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ నెల20వ తేదీ లోపల www. yctnandyal. org ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.