సుంకేసుల పెరుగుతున్న వరద.. 30,923 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

76చూసినవారు
కర్నూలు జిల్లాలో సుంకేసుల రిజర్వాయర్ కు క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. శనివారం ఉదయం 30, 923 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 7 గేట్లను ఎత్తి 29, 154 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 1, 769 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్