వైసీపీ ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకాలు ధ్వంసం

2994చూసినవారు
నంద్యాల మండలం రాయామల్పురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రోజున ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొంతమంది సోమవారం ధ్వంసం చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించిన శిలాఫలకాలను కొందరు టిడిపికి చెందిన వారు కక్ష సాధింపు తో ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసిపి నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్