పథకాల్లో అనర్హులు ఉంటే కోతలు విధిస్తాం: ఎమ్మెల్యే

62చూసినవారు
పథకాల్లో అనర్హులు ఉంటే కోతలు విధిస్తాం: ఎమ్మెల్యే
గత ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలలో అనర్హులు ఉంటే కోతలు విధిస్తామని ఎమ్మెల్యే గౌరు చరిత హెచ్చరించారు. ఆదివారం ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్ల పట్టాల పంపిణీని పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పట్టాలు ఇస్తామని బినామీదారులు పట్టాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్