పాణ్యం: కుక్కల దాడిలో 150 గొర్రెపిల్లలు మృతి

73చూసినవారు
పాణ్యం: కుక్కల దాడిలో 150 గొర్రెపిల్లలు మృతి
ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో బుధవారం కుక్కల దాడిలో సుమారు 150 గొర్రెపిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన నాగ ఎర్రమల, పెద్ద మద్దయ్య, నడిపి మద్దయ్య, రామకృష్ణ అనే నలుగురు అన్నదమ్ముళ్లకు చెందిన 150 గొర్రెపిల్లలను గ్రామ శివారులోని జగనన్న కాలనీ పక్కన గొర్లదొడ్డిలో ఉంచి వెళ్లడంతో, ఊరకుక్కలు బుధవారం దొడ్డిలోకి ప్రవేశించి దాడికి పాల్పడడంతో గొర్రెపిల్లలన్నీ అక్కడికక్కడే మృతి చెందాయని వాపోయారు.

సంబంధిత పోస్ట్