కల్లూరు మండలంలో సీసీరోడ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీఈ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కల్లూరు మండలంలోని ఉలిందకొండ, కొంగనపాడు గ్రామాల్లో జరుగుతున్న సీసీరోడ్ల పనులను ఆయన పరిశీలించి, మాట్లాడారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్ ఏఈ రవిమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.