ఓర్వకల్లు మండలంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం నన్నూరు గ్రామ వైసీపీ ఎంపీటీసీతో పాటు 40 కుటుంబాలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కల్లూరులోని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా వేసి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ప్రాధాన్యత కల్పిస్తామని, టీడీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.