చదువుల తల్లుల జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, అయ్యన్నలు అన్నారు. సోమవారం ఓర్వకల్లులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వారు మాట్లాడారు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ల జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. స్త్రీవిముక్తి విద్యతోనే సాధ్యమని సావిత్రిబాయి పూలే చెప్పారన్నారు.