గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని కల్లూరు మండలం సీపీఐ నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో వీకర్ సెక్షన్ కాలనీ, ముజఫర్ నగర్ తో పాటు పలు సచివాలయాల్లో ఉద్యోగులకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. పేదలకు స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల రూపాయాలు మంజూరు చేయాలన్నారు.