పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పశ్చిమబెంగాల్ వాసి మృతి మృతి చెందాడు. సోమవారం స్థానికుల సమాచారం మేరకు మండలంలోని పెసరవాయి-కరిమద్దెల గ్రామాల మధ్య బండి ఆత్మకూరు మండలానికి చెందిన ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో బోల్తా పడడంతో వరినాట్లు వేయడానికి వచ్చిన పశ్చిమబెంగాల్ కు చెందిన సునీల్ సర్దార్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు.