పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె, ఓర్వకల్లు గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి పంటలకు అపార నష్టం కలిగింది. పొగాకు పంటకు మంచి డిమాండ్ ఉండడంతో ఈ ఏడాది అధిక శాతం రైతులు ఈ పంటనే సాగు చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాలలో సాగు చేసిన పొగాకు పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు నీటి కుంటలుగా మారి రైతులు తీవ్రంగా నష్టపోయారు.