పత్తికొండ - Pathikonda Mandal

గడపగడపకు మన ప్రభుత్వం

తుగ్గలి మండలం ,జి. ఎర్రగుడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణులకు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ, పార్టీలకు అతీతంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో తుగ్గలి మండల వైసిపి కన్వీనర్ జిట్టా నాగేష్ యాదవ్, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిట్టా లక్ష్మీదేవి, ఎర్రగుడి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, మండల వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా
ఉస్మానియా యూనివర్సిటీలో 25న జాబ్ మేళా
Oct 23, 2024, 17:10 IST/ఉప్పల్
ఉప్పల్

ఉస్మానియా యూనివర్సిటీలో 25న జాబ్ మేళా

Oct 23, 2024, 17:10 IST
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కంపెనీలోని 30 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసిన 29 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలకు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది.