అట్టహాసంగా వినాయక నిమజ్జనం
పెద్దకడుబూరు మండలంలోని చిన్నతుంబలం, కల్లుకుంట, హెచ్ మురవణి, బసలదొడ్డి, కంబలదిన్నె, జాలవాడి, పీకలబెట్ట, పెద్దకడబూరులలో సోమవారం వినాయకుల నిమజ్జనం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత మూడు రోజుల నుంచి వినాయకునికి వివిధ రకరకాలైన పిండివంటకాలతో నైవేద్యములు సమర్పించారు. సాయంత్రం 5 గంటలకు వినాయకుల నిమజ్జన ఊరేగింపు ప్రధాన రహదారుల వెంబడి గణపతి బొప్పా మోరియా నినాదాల మధ్య అట్టహాసంగా జరిగింది.