స్వయం ఉపాధిని కల్పించే వృత్తి విద్య కోర్సులైన నర్సింగ్ లాంటి కోర్సులను చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును పొందవచ్చని ఆత్మకూరు కస్తూరిబా గాంధీ పాఠశాల ఒకేషనల్ టీచర్ న్యాన్సి బ్యూలా అన్నారు. శనివారం పారిశ్రామిక ప్రదర్శనలో భాగంగా కొత్తపల్లి కేజీబీవీ ఒకేషనల్ విద్యార్థులను ఆత్మకూరు పట్టణంలోని థెరిసా కళాశాలలో కంప్యూటర్లు పనితీరు వాటి నిర్వహణ తదితర అంశాలను వివరించి సందర్శింప జేశారు.