శ్రీశైలంలో లోక కళ్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఎమ్. కనకలక్ష్మీ మైలవరం, విజయవాడ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సోమవారం సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెండి రథోత్సవం, మూషికవాహన, గణపతికౌత్వం, శివతాండవం, లింగాష్టకం ప్రదర్శన చేశారు.