మహానంది: ఏటీఎంను పగలగొట్టిన దుండగులు

70చూసినవారు
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి మెట్ట వద్ద ఉన్న ఏటీఎంను గుర్తుతెలియని దుండగులు పగలగొట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లగా ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రోడ్డు భద్రత విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్