శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఒకటో నెంబర్ జనరేటర్ లో నీరు లీక్ అవుతుంది. డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వారం రోజులుగా లీక్ అవుతున్నట్లు సమాచారం. పంప్ మోడ్ టర్బెన్ వేగంగా తిరగడంవల్లే సమస్య తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. లీకేజీని అరికట్టకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోవడంతో పాటు జనరేటర్ నీట మునిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.