ప్రసిద్ధ మత బోధకుడు, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్ 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మొహాలీ కోర్టు అతడిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది. తనని విదేశాలకు తీసుకెళ్లేందుకు హోటల్ గదికి పిలిచి, లైంగిక దాడి చేసి, ఆ దృశ్యాలను రికార్డ్ చేసి, బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాజిందర్‌ను అరెస్టు చేశారు.