పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట అఖిల పక్ష రాజకీయ పార్టీలు ధర్నా

1279చూసినవారు
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట అఖిల పక్ష రాజకీయ పార్టీలు ధర్నా
రాష్ట్రంలో రాక్షస పాలన రాచరిక పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదామని టిడిపి నేతలు పేర్కొన్నారు. శుక్రవారం టిడిపి, సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎం. ఎల్) న్యూ డెమోక్రసీ ఇతర పార్టీలు, యస్. సి, యస్. టి, బి. సి, మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం నుండి డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌ శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో. టిడిపి నేతలు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, నాయకులు ఎరుకల మారెన్న, రోజా ఆర్ట్స్ ఉసేని, దర్జీ మోషన్న, కంపాడు చిన్న రంగన్న, యస్. హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో. "కదిరికోట ఆదెన్న" మాట్లాడుతూ.. జగన్ సర్కారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ. 57, 188 కోట్ల రూపాయల భారాన్ని మోపి విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచారని ఆవేదన చెందారు. స్మార్ట్ మీటర్లను మోటార్లకు బిగించి రైతులకు ఉరితాళ్లు గా మార్చారని మండిపడ్డారు. 73 ఏళ్ల చరిత్రలో. 20 మంది ముఖ్యమంత్రులు 7వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కరే తన హాయంలో 15 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ ను సాగనంపడానికి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో పసుపు జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. జగన్ పోవాలి! చంద్రన్న రావాలి! అని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ పాలనను తరిమికొట్టేందుకు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజలను చైతన్యం చేసేందుకు ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్