కర్ణాటక మద్యం కేసులో పట్టుబడిన ఒక నిందితుడిని ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. నిందితుడు స్పృహ తప్పి పడిపోయిన సంఘటన గురువారం ఎక్సైజ్ స్టేషన్లో చోటు చేసుకుంది. మద్యం రవాణాలో భాగంగా రంగన్న, నాగార్జునలను అదుపులోకి తీసుకొని విచారణలో ఎస్సై ఇస్మాయిల్ విచక్షణారహితంగా చితకబాదడంతో నాగార్జున స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.