మైనర్లు వాహనాలు నడపడం చట్ట రీత్యా నేరమని ఎమ్మిగనూరు టౌన్ సీఐ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మాచాని మెమోరియల్ హాల్ వద్ద టౌన్ సీఐ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.