ఎమ్మిగనూరు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు.. బైక్ సీజ్

61చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలో గతనెల 13న రెండు మద్యం దుకాణాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పట్టణ సీఐ శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు స్కూటర్ ను ఉపయోగించినట్లు సీసీఫుటేజీలో నమోదైందని, ఎమ్మిగనూరు నుంచి దోర్నాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సీసీకెమెరాల దృశ్యాలను పరిశీలించి, నిందితులను అరెస్టు చేసి, రూ. 71 వేలు, బైక్ సీజ్ చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్