కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు. నందవరం మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన బోయ హరికృష్ణ, బోయ నాగార్జున, బోయ రంగన్న అనే వ్యక్తులు ద్విచక్ర వాహనాల్లో 15 బాక్సులో కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా, పట్టుకున్నట్లు సీఐ రమేష్ రెడ్డి తెలిపారు. వీటి విలువ రూ. 57, 600 ఉంటుందన్నారు.