ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరా తీశారు. గురువారం విద్యార్థులతో ఆయన మాట్లాడారు. కళాశాలలో లైబ్రేరియన్ విధింపులు కలకలం సృష్టించడంతో ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.