కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం కృష్ణాష్టమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో వెలసిన లక్ష్మీమాధవ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో భూదేవి, లక్ష్మి సమేత గోరంట్ల మాధవస్వామికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.