వేముగోడు: బైక్ పై నుండి పడి ఒకరు మృతి

82చూసినవారు
వేముగోడు: బైక్ పై నుండి పడి ఒకరు మృతి
భార్యతో కలిసి బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న వ్యక్తి మార్గమధ్యలో శనివారం మృతి చెందాడు. ఈ ఘటన గోనెగండ్ల మండలం వేముగోడు వద్ద జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన షేక్ యూసుఫ్(55) తమ బంధువు అంత్య క్రియలకు భార్య జరీనా బేగంతో కలిసి స్కూటీపై ఎమ్మిగనూరుకు బయలుదేరాడు. వేముగోడు సమీపంలో యూసుఫ్ కు బీపీ డౌన్ కావడంతో స్కూటీ పై నుంచి కిందపడ్డాడు. దింతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్