నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో మోహన్ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ లోపలికి వచ్చింది. అక్కడ ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అరుపులు విని ఇంటిలోని వారు తలుపులు తీయడంతో చిరుతపులి పరారైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరలవుతోంది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.