ఇండియన్ నాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. మంగళవారం 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే.. ఐజీఎల్ ఇన్వెస్టర్లు వారి దగ్గర ఉన్న ప్రతి ఈక్విటీ షేరుకు అదనంగా మరో ఈక్విటీ షేరు అందుకోనున్నారు. అంటే.. ఇన్వెస్టర్ దగ్గర 100 షేర్లు ఉంటే.. మరో 100 బోనస్ షేర్లు వస్తాయి. అప్పుడు అతడి దగ్గర మొత్తం షేర్ల సంఖ్య 200 అవుతుంది.