పోలీసు సోదరులను ఆదుకుంటాం: నారా లోకేష్

79చూసినవారు
పోలీసు సోదరులను ఆదుకుంటాం: నారా లోకేష్
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు అప్పులబాధ భరించలేక నిన్న ఆత్మహత్య చేసుకోవడం నన్ను తీవ్రంగా కలచివేసిందని నారాలోకేష్ అన్నారు. పోలీసులకి రావాల్సిన టీఏ, డీఏ, అరియర్స్, అత్యవసర ఆరోగ్య భద్రత రుణాలు ఏళ్ళ తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శంకర్రావు స్మృతికి నివాళులర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు సోదరులను ఆదుకుంటామని మాట ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్