ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

51చూసినవారు
AP: ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పక్షులను వేటాడే వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు దగ్ధమయ్యాయి. పక్షులను బెదిరించే నాటు తుపాకీలో వాడే మందు గుండు సామాగ్రికి దోమల అగరబత్తీ అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో పాటు ఇళ్లల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్